త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

by Sridhar Babu |
RTC bus, accident
X

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఖమ్మం నుంచి కోదాడ వైపు వెళ్తోన్న ఓ బస్సు మండల కేంద్రానికి చేరుకోగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి, పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఓ పాపకు స్వల్ప గాయాలు, మిగిలిన వారందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే, ఎలాంటి హెచ్చరిక బోర్డుటు పెట్టకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు. ప్రమాదం జరిగిందని భావించిన డ్రైవర్ వెంటనే దూకి పారిపోయాడని, బస్సు కోదాడ డిపోకు చెందినదని గుర్తించారు. కాగా, పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed