సీఎం సహాయనిధికి విరాళం

by Shyam |
సీఎం సహాయనిధికి విరాళం
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.90.48 లక్షల విలువైన 3వేల ఐఆర్ థర్మోమీటర్లు, 3వేల ఆక్సీమీటర్లను హ్యాండయ్ మొబిస్ ఇండియా లిమిటెడ్ అందజేసింది. శుక్రవారం ప్రగతి భవన్‌లో సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసి అందించారు. సంక్షోభ సమయంలో సాయం అందించినందుకు హ్యాండయ్ మొబిస్ లిమిటెడ్ ప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో మంత్రి అజయ్ కుమార్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story