మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం

by Anukaran |   ( Updated:2020-08-09 01:01:11.0  )
మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని ఓ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాగా, స్వర్ణప్యాలెస్ లోని కొవిడ్ కేర్ సెంటర్ తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతిచెందారు.

Advertisement

Next Story