మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.2050 కోట్లు..!

by srinivas |
మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.2050 కోట్లు..!
X

దిశ, వెబ్‎డెస్క్:

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.2,050 కోట్లు అనుమతులు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిది.

ఈ నేపథ్యంలో పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు, పులివెందులలో కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు, పిడుగురాళ్లలో కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు, మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.550 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆయా మెడికల్ కాలేజీల్లో చెరో 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు అయ్యాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో ఆస్పత్రి సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story