రూ.1కే చికెన్ బిర్యానీ

by Shamantha N |
రూ.1కే చికెన్ బిర్యానీ
X

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విస్తరిస్తుండటంతో మార్కెట్‌లో చికెన్ ధరలు నేలను తాకుతున్నాయి. తమిళనాడులోని ఓ హోటల్‌లో ఏకంగా చికెన్‌ బిర్యానీనే రూ.1కి అమ్ముతున్నారు. కరోనావైరస్‌ బ్రాయిలర్‌ కోళ్ల ద్వారా వ్యాపిస్తుందంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలతో కోళ్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. అలాగే, ప్రజలు చికెన్‌ బిర్యానీ కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో హోటల్‌ యజమానులు చికెన్‌ బిర్యానీ కొంటే చికెన్‌-65 ఉచితమంటూ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా పొన్నేరిలో రూ.1కే చికెన్‌ బిర్యానీ అందించడంతో, హోటల్‌ వద్ద ప్రజలు బారులు తీరగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు విధులు చేపట్టారు. హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.1కే చికెన్‌ బిర్యానీ అని బోర్డులు పెట్టడంతో ప్రజల ఆసక్తిచూపి హోటల్‌పై ఎగబడ్డారు. తొలిరోజు మధ్యాహ్నం 12గంటలకు విక్రయాలు ప్రారంభించగా రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్‌ బిర్యానీ అయిపోయింది. ప్రజలు బిర్యానీ కోసం బారులు తీరడంతో పోలీసులు విధులు చేపట్టారు. ఈ విషయమై హోటల్‌ యజమాని మాట్లాడుతూ.. కొత్తగా హోటల్‌ ప్రారంభించామని, కరోనా భయంతో బిర్యానీ విక్రయమవుతుందా అనే సందేహం కలిగిందన్నారు. రూ.1కే అని ప్రకటించిన రెండు గంటల్లోనే బిర్యానీ విక్రయమైందని ఆయన తెలిపారు.

slug : Rs.1 Chicken Biryani
tags : Rs.1 Chicken Biryani, carona virus, thamilanadu, thiruvallur, new hotel


Next Story