జక్కన్న సర్‌ప్రైజ్

by Shyam |
జక్కన్న సర్‌ప్రైజ్
X

ర్ఆర్ఆర్… సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రోజుకు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సినిమాలో ఆ స్టార్ ఎంపికయ్యాడని, ఆ హీరో పాత్ర ఇదని, ఈ హీరోయిన్ రోల్ ఇలా ఉంటుందని, ఎప్పుడూ ఏదో ఒక న్యూస్. సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఏడాది కావస్తున్నా దీనిపై ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్స్ ఇవ్వలేదు దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పాత్ర గురించి వివరించిన జక్కన్న స్టోరీ‌లైన్ చెప్పాడే తప్పా కనీసం ఒక్క గ్లింప్స్ కూడా షేర్ చేయలేదు ఇప్పటి వరకు. ఈ మధ్య బాహుబలి టీం కూడా మా మహిష్మతి ప్రజలు మీ ఆర్ఆర్ఆర్ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారని, శుభాకాంక్షలు, ధన్యవాదాలతో కాలం వెళ్లదీయకుండా టీజర్, ట్రయలర్ లేదా కనీసం మేకింగ్ అయినా పోస్ట్ చేయాలని కోరింది.

అందుకేనేమో జక్కన్న ఆర్ఆర్ఆర్ అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. స్పెషల్ వీడియోను వీలైతే ఈ నెలలోనే విడుదల చేయనుందట చిత్రయూనిట్. ఇందుకోసం అలియాభట్ మీద ప్రత్యేక సన్నివేశాలు కూడా తీశారని సమాచారం. అయితే ఈ వీడియోలో తారక్, చెర్రీల అప్ డేట్స్ ఉంటాయో? లేదో? అనేది ఇండస్ట్రీ టాక్. దాదాపు చరణ్, ఎన్టీఆర్ ల లుక్స్ వీడియోల ఉండవనే తెలుస్తోంది. మొత్తానికి జక్కన్న బాగానే కరుణించాడు. ఏడాదిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ నెల ఈ స్పెషల్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.

అంతేకాదు సినిమాను జనవరి 8, 2021లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ సినిమాకు పోటీగా మరో సినిమా రాదనే అర్ధమవుతుంది. జూలై 30, 2020న విడుదల కానున్న ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

Advertisement

Next Story