కరోనా జాగ్రత్తలు.. విన్నూతంగా చెప్పిన 'ఆర్ఆర్ఆర్' బృందం

by Anukaran |   ( Updated:2021-05-06 05:01:09.0  )
కరోనా జాగ్రత్తలు.. విన్నూతంగా చెప్పిన ఆర్ఆర్ఆర్ బృందం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విలయతాండం చేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలలో భయాందోళనలను కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి ఒకటే పరిష్కారం ఉంది.. అదే వ్యాక్సిన్. కరోనాను ఎదుర్కోవాలంటే సరైన అవగాహనతోపాటు ధైర్యం మన దగ్గరున్న మార్గాలు. అందుకే సినీ ప్రముఖులంతా కరోనాపై అవగాహన కల్పించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఇప్పటీకే చాలామంది సినీప్రముఖులు కరోనా పై అవగాహనా కల్పిస్తూ వీడియోలు చేశారు . తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం విన్నూత ప్రచారం చేపట్టింది. కరోనా ఎలా ఉంటుంది.. దాన్ని తరిమికొట్టడానికి మనం చేయాల్సిన కృషి ఏంటి? అనేది ఐదు భాషల్లో వివరిస్తూ #stand together పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు.

హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, హీరోయిన్ అలియా భట్, దర్శకుడు రాజమౌళి, నటుడు అక్షయ్ కుమార్ లు తెలుగు, మలయాళం, తమిళ్ కన్నడ, హిందీ భాషల్లో కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని తెలిపారు. అందరు తప్పకుండ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అలియా భట్‌ తెలుగులో.. రామ్‌చరణ్‌ తమిళంలో.. ఎన్టీఆర్‌ కన్నడలో.. రాజమౌళి మలయాళంలో.. అజయ్‌దేవ్‌గణ్‌ హిందీలో మాట్లాడుతూ.. కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. ఖచ్చితంగా మాస్కు ధరించాలని, శానిటైజర్ తో తరచుగా చేతులను శుభ్రం చేసుకుంటుండాలని, భౌతికదూరం తప్పనిసరి అని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సభ్యులు పిలుపునిచ్చారు.

వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను నమ్మకుండా వ్యాక్సిన్ వేయించుకొని, బందువులకు స్నేహితులకు సైతం వ్యాక్సిన్ వేయించుకొనే ప్రోత్సహించాలని తెలిపారు. మాస్క్‌ ధరిద్దాం.. వ్యాక్సిన్‌ వేయించుకుందాం అనే నినాదంతో వీడియోను ఎండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ విషయానికొస్తే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed