- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
26 వేలకు పైగా బైకులను రీకాల్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తన క్లాసిక్ 350 మోడల్‌లో వెనక బ్రేక్ సమస్య ఉన్నందున 26,300 యూనిట్లను రీకాల్ చేసినట్టు వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో బైక్ వెనక బ్రేక్ పెడల్‌ను గట్టిగా నొక్కితే రెస్పాన్స్ బ్రాకెట్ దెబ్బతినవచ్చని, దీనివల్ల ఎక్కువ శబ్దం రావడం, బ్రేకింగ్ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉన్న కారణంగానే ఈ వాహనాలను రీకాల్ చేసినట్టు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి రోడ్డు, రవాణా రహదారుల శాఖకు, ఆటోమొబైల్ మాన్యూఫక్చర్ అసోసియేషన్ సియామ్‌కు సమాచారం అందించినట్టు పేర్కొంది. రీకాల్‌లో భాగంగా ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5వ తేదీల మధ్య ఉత్పత్తి చేసిన సింగిల్ ఛానల్ ఏబీఎస్ క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లలో మాత్రమే ఈ సమస్య ఉందని, బైక్ వీఐఎన్ నంబర్ ఆధారంగా కంపెనీ స్థానిక డీలర్లు వినియోగదారులను సంప్రదించనున్నట్టు కంపెనీ వివరించింది. ‘రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో పటిష్ఠమైన, కఠినమైన టెస్టింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. డిజైన్ అభివృద్ధి, నాణ్యత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారీని చేపడుతున్నాం. కొన్ని సమయాల్లో మాత్రమే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా వీటిని పరిష్కరిస్తామని’ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.