- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త టీమ్‌పై కన్నేసిన అదాని, గోయెంకా
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలను వచ్చే సీజన్‌లో చేర్చేది లేదని బీసీసీఐ పరోక్షంగా స్పష్టం చేసినా ఇంకా దానిపై రూమర్లు మాత్రం ఆగడం లేదు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి కొత్త టీమ్ వస్తుందని.. దానికి సురేష్ రైనా కెప్టెన్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకూ ఆ వార్తలపై స్పష్టత లేదు. తాజాగా అదాని గ్రూప్‌తో పాటు గోయెంకా కూడా కొత్త జట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. గోయెంకా ఇంతకు మునుపే పూణే జట్టను రెండేళ్ల పాటు నిర్వహించారు. రాజస్థాన్, చెన్నై జట్లు సస్పెన్షన్‌కు గురికావడంతో కేవలం తాత్కాలికంగానే పూణే జట్టుకు అవకాశం లభించింది.
అయితే అప్పట్లో పూణే జట్టు యజమాని గోయంకానే శాశ్వతంగా ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు అదాని గ్రూప్ కూడా గుజరాత్ లేదా కేరళ నుంచి ఒక ఫ్రాంచైజీని దక్కించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. కాగా, డిసెంబర్ రెండో వారంలో కొత్త ఫ్రాంచైజీలు, వేలం పాటపై నిర్ణయం తీసుకోనున్నట్టు బీసీసీఐ తెలిపింది. దీంతో వీళ్లందరూ మరో నెల రోజుల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.