క్రీడలకు టెక్నాలజీ అనుసంధానం చేస్తాం

by Shyam |
క్రీడలకు టెక్నాలజీ అనుసంధానం చేస్తాం
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) క్రీడా విభాగం కార్య‌ద‌ర్శిగా రోణిత్ బండాను నియ‌మిస్తూ టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల ఆదేశాలు జారీ చేశారు. స్వ‌దేశంలో, అమెరికాలో విద్యాభ్యాసం చేయ‌డంతో పాటుగా క్రీడ‌ల్లో పాల్గొన‌డంలో ప్ర‌త్యేక నైపుణ్యం క‌లిగి ఉన్న రోణిత్ రాష్ట్రంలోని ఔత్సాహికులు, యువ క్రీడాకారుల‌కు నూత‌న అవ‌కాశాలు క‌ల్పించే దిశ‌గా కృషి చేస్తార‌ని వెల్ల‌డించారు. ఐబీఎం సంస్థ‌లో ప‌నిచేసిన అనుభ‌వం, అంత‌ర్జాతీయ నైపుణ్యం ఆధారంగా టెక్నాల‌జీని క్రీడ‌ల‌తో అనుసంధానం చేయ‌నున్న‌ట్లు టీటా స్పోర్ట్స్ సెక్ర‌ట‌రీగా నియ‌మితులైన రోణిత్ బండా తెలిపారు. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన రోణిత్ బండా అమెరికాలో ప్రాథ‌మిక‌ విద్యాభ్యాసం చేసి, బీటెక్ విద్యాభ్యాసం స్వ‌దేశంలో పూర్తి చేశారు. క్రీడ‌ల‌పై ఉన్న ఆస‌క్తితో ఉద్యోగం చేస్తున్న స‌మ‌యంలోనే అమెరికన్ ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించారు. కొన్ని లీగ్‌ల‌లో ఆడిన తర్వాత ఇండియా కెప్టెన్ అయ్యారు. 2015 నుంచి నేటి వరకు ఇండియన్ టీం క్యాప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటుగా కీల‌క‌మై క్వార్టర్ బ్యాక్ (మెంటర్)గా వ్యవహరిస్తున్నారు.

2018లో పనమాలో అమెరికన్ ఫుట్ బాల్ వరల్డ్ ఛాంపియన్ నిర్వహించగా 8వ స్థానంలో భార‌త జ‌ట్టును నిల‌ప‌డం రోణిత్ స‌త్తాకు నిద‌ర్శ‌నం. 2022 జ‌ర‌గ‌నున్న వరల్డ్ చాంపియన్స్ కోసం రోణిత్ జ‌ట్టు సిద్ద‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా రోణిత్ బండా మాట్లాడుతూ తెలంగాణ‌లో రాబోయే కాలంలో క్రీడ‌ల‌ను మ‌రింత అభివృద్ధి చెందించేందుకు కృషి చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఐటీ రంగంలోని ఉద్యోగులకు క్రీడ‌ల‌పై ఆస‌క్తి ఉంటుంది. కానీ స‌రైన మార్గ‌ద‌ర్శ‌నం లేక‌పోవ‌డం వ‌ల్ల‌ దాన్ని అభివృద్ధి చెందించుకోవ‌డం లేదు. స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన క్రీడ‌లు ఆడ‌టం, డేటా గేద‌రింగ్‌, స్ట‌డీ ఆఫ్ డేటా వంటి అంశాల్లో మ‌రింత కృషి జ‌ర‌గాల్సి ఉంది. ఈ అంశాల‌న్నింటిపై తెలంగాణ కేంద్రంగా కృషి చేయ‌నున్నాను“ అని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న‌ నూత‌న విద్యావిధానంలో విద్యార్థుల‌కు క్రీడ‌ల ప‌రంగా ఎంతో మేలు చేయ‌నుందని రోణిత్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed