- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌కు రోజా మర్చిపోలేని గిఫ్ట్!
దిశ, వెబ్‌డెస్క్ : అన్న పుట్టిన రోజుకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని చెల్లెలు భావించింది. పూల బోకే, విదేశీ వస్తువులు, ఖరీదైన బహుమతులు ఏవీ నచ్చలేదు ఆమెకు. వీటన్నింటికి మించి చేయాలనుకున్న ఆమె.. ఓ అనాథ బాలికను దత్తత తీసుకొని, ఆమె విద్య, సంరక్షణ బాధ్యతలు స్వీకరించింది. ఆ అన్న మర్చిపోలేని బహుమతిని ఇచ్చి.. అందరి నోటా ఔరా.. అనిపించుకుంది. ఇంతకు ఆ అన్నాచెల్లెలు ఎవరనుకున్నారు..? ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా.
జగనన్నా.. అని ఆప్యాయంగా పిలుచుకునే రోజా.. ఈ ఏడాది జగన్ బర్త్ డేకు అపురూపమైన గిఫ్ట్ ఇచ్చింది. #bbbbroja హ్యాష్‌ట్యాగ్‌తో #AdoptGirlChild ప్రారంభించి తల్లిదండ్రులు లేని పల్లిపట్టు పుష్పకుమారి అనే బాలికను దత్తత తీసుకుంది. ఆ బాలికకు విద్యా, వసతితోపాటు మంచి భవిష్యత్ అందించాలని నిర్ణయం తీసుకుంది. రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే నిరంతరాయంగా సామాజిక సేవలు చేస్తున్న రోజా.. జగన్ పుట్టిన రోజు గుర్తుగా పుష్పకుమారి జీవితానికి పూలబాటలు వేయడానికి ముందుకు వచ్చింది. రోజా తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, సోమవారం దత్తత తీసుకున్న బాలిక వివరాలను సీఎం జగన్‌కు వివరించింది. ఈ సందర్భంగా రోజా ఓ ట్వీట్ చేశారు. ‘జగనన్న పుట్టిన రోజు సందర్భంగా నేను దత్తత తీసుకున్న చిన్నారి గురించి వీడియో చూపించి వివరించాను. జగనన్న చాలా సంతోషించారు. నా అభిమాన నాయకుడి పేరు మీద చిన్నారిని చదివిస్తున్నందుకు గర్వంగా ఉంది.’ అని ట్వీట్ చేసింది.
జగనన్న పుట్టిన రోజు సందర్భంగా నేను దత్తత తీసుకున్న చిన్నారి గురించి వీడియో చూపించి వివరించాను. జగనన్న చాలా సంతోషించారు. నా అభిమాన నాయకుడి పేరు మీద చిన్నారిని చదివిస్తున్నందుకు గర్వంగా ఉంది. 😍@ysjagan #AdoptGirlChild #RojaSelvamani #bbbbroja #YSjagancares #Jagananna pic.twitter.com/AicdhuL3Qz
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 28, 2020