కోహ్లీ కెప్టెన్సీ‌పై అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

by Shyam |
Rohit Sharma, Virat Kohli
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టును ఎంపిక చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటన చేయడంతో భారత వైట్‌బాల్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నియమితులయిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు విరాట్ కోహ్లీ ఇదివరకే ప్రకటించాడు. అయితే రోహిత్ పొట్టి ఫార్మాట్‌లో పగ్గాలు చేపట్టడమే కాకుండా వన్డే క్రికెట్‌లో కూడా కోహ్లీతో పాటు సుదీర్ఘమైన ఫార్మాట్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. భారతదేశం యొక్క కొత్త వైట్-బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ జట్టును ప్రశంసించాడు.

బీసీసీఐ పోస్ట్ చేసిన ఓ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ.. కోహ్లీ ఎప్పుడూ జట్టును ముందుండి నడిపించేవాడు. “అతను జట్టును వెనక్కి తిరిగి చూడలేని పరిస్థితిలో ఉంచాడు. ఆ ఐదేళ్లు అతను జట్టును నడిపించాడని ప్రశంసించాడు. “మేము అతని కింద చాలా గొప్పగా ఆడాము. నేను కోహ్లీ కెప్టెన్సీలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను అని పేర్కొన్నారు. సారథి కావడంపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. ఈ అవకాశం నేను పూర్తిగా సంతోషిస్తున్నాను. వైట్ బాల్ క్రికెట్‌లో టీమ్ ఇండియాను నడిపించడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఇది ఒక ఉత్తేజకరమైన ప్రయాణం అవుతుంది” అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed