- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వృద్ధులే వారి టార్గెట్.. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి వారిపై..
దిశ, పెద్దపల్లి: కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ దొంగలు అఘాయిత్యాలు ఆగడం లేదు. తమను అడ్డుకోలేని ఒంటరి వృద్ధులను టార్గెట్ గా చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒంటరిగా ఉంటున్న వృద్ధుల ఇంటిపై దొంగతనానికి పాల్పడి, వారిపై తీవ్రంగా దాడి చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలు దొంగిలించిన ఘటన ఓదెలా మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఓదెలా మండలకేంద్రంలో ఒంటరిగా నివసిస్తున్న చింత రాజమ్మ, కనకమ్మ అనే వృద్ధుల ఇళ్లపై మంగళవారం తెల్లవారు జామున తలుపులు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు చొరబట్టారు. వృద్ధులను తీవ్రంగా గాయపరిచి వారి ఒంటిపైన ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్దులను బంధువులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుల పరిస్థితి విషమించడంతో వైద్యులు కరీంనగర్ హాస్పిటల్ కు పంపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.