వరికోత యంత్రాన్ని ఢీకొన్న బైక్

by Sumithra |
వరికోత యంత్రాన్ని ఢీకొన్న బైక్
X

దిశ, మెదక్: బైక్ లిఫ్ట్ అడిగి ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తూప్రాన్ ఎస్ఐ తెలిపిన వివరాలు మేరకు . తుప్రాన్ పురపాలిక పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన పోచయ్య కాలి నడకన తూప్రాన్ వెళుతున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వెళ్తున్న గంగాధర్ అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగాడు. గీత స్కూల్ సమీపంలోకి రాగానే వరికోత యంత్రాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags: road accident, medak, bike, harvester

Advertisement

Next Story