- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోర ప్రమాదం : ఇసుక లారీని ఢీ కొన్న పోలీసు వాహనం

X
దిశ, భూపాలపల్లి : ఇసుక లారీని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొన్న ఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. భూపలపల్లి జిల్లా నుంచి ఇసుక లారీ పరకాల వైపు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న పోలీసు వాహనం ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐతో పాటు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్సనిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. అయితే లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story