తల్లీకుమార్తెపై దూసుకెళ్లిన లారీ

by srinivas |
తల్లీకుమార్తెపై దూసుకెళ్లిన లారీ
X

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు కోసం రోడ్డుపై వేచిచూస్తున్న తల్లీకుమార్తె పై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కుమార్తె సుజాత (38) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ తల్లి నరసమ్మను ఆసుపత్రికి తరలిచారు. ఈ ఘటన లేపాక్షి మండలం చోళసముద్రం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

tag; road accident, anantapur, crime news

Advertisement

Next Story