గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నిద్రిస్తున్న 9 మృతి

by Sumithra |   ( Updated:2021-08-09 01:22:48.0  )
గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నిద్రిస్తున్న 9 మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్‌లోని అమ్రేలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ట్రక్క దూసుకెళ్లడంతో అందులో ఉన్న 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. సావర్‌కుండ్లా గ్రామానికి సమీపంలోని గుడిసెలో కార్మికులు నిద్రిస్తున్నారు. ఆ సమయంలో అదుపు తప్పిన ట్రక్కు వేగంగా గుడిసె మీదకు దూసుకొచ్చింది. దీంతో గుడిసెలో ఉన్న తొమ్మిది మంది చనిపోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రి తరలించారు. మృతుల్లో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. క్రేన్‌ను తరలిస్తున్న సమయంలో ట్రక్కు అదుపుతప్సి గుడిసెలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.

Advertisement

Next Story