- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద తప్పిన ఘోర ప్రమాదం.. బాధ్యులు ఎవరు.?
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ధనుర్మాస పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం పాత బస్టాండ్ వైపు ఒకటి, రైతు బజార్ వైపు ఒకటి ఆర్చిలు కడుతున్నారు. ఈ సంవత్సరం రైతు బజార్ వైపు అతి పెద్ద ఆర్చి ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో భారీ లోడుతో వస్తున్న లారీ.. ఆర్చిని ఢీ కొట్టడంతో అది కిందపడిపోయింది. తెల్లవారుజామునే కావడంతో జన సంచారం తక్కువ ఉండడంతో ప్రజలకు ప్రాణాపాయం తప్పింది. గతంలో కూడా ఆర్చిలు ఏర్పాటు చేయడంతో భారీ వాహనాలు తగిలి కిందపడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇలా భారీ వాహనాలు ఈ మార్గంలో పట్టణంలోకి రావడానికి అనుమతి లేకున్నా.. ఎలా వస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీరికి మున్సిపాలిటీ అధికారులు ఆర్డర్స్ ఇచ్చారా.? లేక పోలీసులు పర్మిషన్ ఇచ్చారా.? అనేది తెలియాల్సి ఉంది.