KTR కాన్వాయ్ వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఎస్కార్ట్‌ ఆపి మంత్రి ఏం చేశారంటే.?

by Anukaran |
KTR కాన్వాయ్ వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఎస్కార్ట్‌ ఆపి మంత్రి ఏం చేశారంటే.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రోడ్డు ప్రమాద బాధితులకు కేటీఆర్ సాయం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటినా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించేలా కృషి చేశారు. కేటీఆర్ బుధవారం సిరిసిల్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న తరుణంలో హకీంపేట వద్ద మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈరోజు రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అది గమనించిన మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్‌ను ఆపారు. సిబ్బందితో క్షతగాత్రులను ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించినట్లు సమాచారం.

Advertisement

Next Story