మరోసారి 'పెట్రో' షాక్.. మళ్లీ పెరిగిన ధరలు

by Harish |   ( Updated:2021-07-15 03:41:53.0  )
petrol
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడటం లేదు. వాహనదారులకు చమురు సంస్థలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. పెరుగుతున్న ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలు వాహనదారుల జేబుకు చిల్లులు పెడుతున్నాయి. ఇవాళ మరోసారి వాహనదారులకు పెట్రోల్, డీజిల్ షాక్ తగిలింది. చమురు సంస్థలు మరోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 16 పైసలు పెరిగింది. ఈ పెంపుతో గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.107.76గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.65గా ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.56 ఉండగా.. డీజిల్ రూ.99.45గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు పెరగ్గా.. డీజిల్‌పై 16 పైసలు తగ్గింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.62గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed