భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు

by Shamantha N |   ( Updated:2021-05-31 22:56:36.0  )
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతీరోజు ఇంధన ధరలు పెరుగుతూ సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూం. 94. 23 గా ఉండగా డీజిల్ ధర రూ. 85. 15 గా ఉంది. వాణిజ్యరాజధాని అయిన ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.47 గా న‌మోదుకాగా డీజిల్ కూడా పెట్రోల్‌తో పోటీ ప‌డీ మ‌రీ పెరుగుతూ లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 92.45 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెట్రోల్ ధరలు పైకి ఎగబాకుతూ సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ. 97.93గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ.92.83 ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రలో ధ‌ర రూ. 100.35 ఉండ‌గా డీజిల్ రూ. 94.66 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed