విడాకులకు కారణమవుతున్న క్వారంటైన్

by Shyam |
విడాకులకు కారణమవుతున్న క్వారంటైన్
X

దిశ, వెబ్‌డెస్క్:
చైనాలో కరోనా వైరస్ తాకిడి తగ్గుముఖం పడుతోంది. గత రెండు నెలలుగా ఇళ్లకే పరిమితమై క్వారంటైన్ మెయింటెయిన్ చేస్తున్న చైనా ప్రజలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. అయితే బయటికి వస్తున్న చాలా మంది దంపతులు సరాసరి విడాకుల లాయర్ దగ్గరికి వెళ్తున్నారట. సెల్ఫ్ ఐసోలేషన్‌లో భాగంగా భార్యభర్తలు ఎక్కువసేపు ఒకరితో ఒకరు గడపడం వల్ల ఇలా విడాకుల వరకు దారితీసిందని విశ్లేషకులు అంటున్నారు.

చైనాలోని సిచువన్ మ్యారేజ్ రిజిస్ట్రీ మేనేజర్ లూ షిజున్ చెప్పిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 24 నుంచి దాదాపు 300ల మంది దంపతులు తమ దగ్గర విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు ఉన్నారని చెప్పారు. యువ దంపతులు ఎక్కువ సమయం ఒకరితో ఒకరు ఒకే ఇంట్లో ఎలాంటి పని లేకుండా గడిపే అవకాశం రావడంతో ప్రతి చిన్న విషయానికి అపార్థాలు వచ్చి, చిన్న వాదనలు పెద్ద వాదనలుగా పరిణమించడాన్ని వారు కారణంగా చెప్పినట్లు లూ షిజున్ అన్నారు. మార్చి 1 తమ రీఓపెనింగ్ తర్వాత మొదటి వంద కేసులు విడాకులవేనని షాంగ్సీ ప్రావిన్స్ న్యాయ అధికారులు కూడా చెప్పారు. ఈ లెక్కన చూస్తే విడాకుల కేసులకు కూడా కరోనాయే కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఇక మన భారతదేశంలో కూడా దాదాపు పూర్తిస్థాయిలో క్వారంటైన్ పీరియడ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు దారి తీయబోతున్నాయో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

Tags: Quarantine, Divorce, China, Wuhan, rise in divorce, family, self quarantine,

Advertisement

Next Story

Most Viewed