40 ఏళ్లలోపు బిలీయనీర్లు వీరే!

by Harish |   ( Updated:2021-10-13 08:24:50.0  )
OYO
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా ప్రస్తుత ఏడాదికి గాన్ భారత్‌లోని స్వతంత్ర బిలీయనీర్ల జాబితాను బుధవారం ప్రకటించింది. హురున్ ఇండియా నివేదిక ప్రకారం రూ. 1,000 కోట్లకు పైగా సంపద కలిగిన 40 ఏళ్ల లోపు స్వతంత్ర బిలీయనీర్లు మొత్తం 45 మంది ఉన్నారు. వీరిలో 42 మంది పారిశ్రామికవేత్తలు భారత్‌లోనే నివశిస్తున్నారు. బెంగళూరు అత్యధిక మంది 40 ఏళ్ల లోపు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా జాబితాలో ఉన్నారు. అలాగే, 40 ఏళ్ల లోపు ఈ పారిశ్రామికవేత్తలకు సాఫ్ట్‌వేర్, సేవలు, రవాణా, లాజిస్టిక్ రంగాలే ప్రధాన ఆదాయ మార్గంగా ఉంది.

ఇక, ఈ జాబితాలో రూ. 12,500 కోట్లతో మీడియా డాట్ నెట్ అధినేత దివ్యాంక్ తురాఖియా అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన వయసు 39 ఏళ్లు. రెండోస్థానంలో 36 ఏళ్ల బ్రౌజర్ స్టాక్స్ సహ-వ్యవస్థాపకుడు నకుల్ అగ్ర్వాల్ రూ. 12,400 కోట్లను కలిగి ఉన్నారు. ఇదే సంస్థ మరో సహ-వ్యవస్థాపకుడు రితేష్ అరోరా(37 ఏళ్లు) రూ. 12,300 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కాన్ఫ్లుయెంట్‌కు చెందిన నేహా నార్ఖెడ్ కుటుంబర్ రూ. 12,200 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామర్(25 ఏళ్లు) రూ. 11,500 కోట్లతో ఐదో స్థానంలో, థింక్ అండ్ లెర్న్ సంస్థకు చెందిన రిజు రవింద్రన్(40 ఏళ్లు) రూ. 8,100 కోట్లతో ఆరో స్థానం, ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్(38 ఏళ్లు) రూ. 8 వేల కోట్లతో ఏడో స్థానం, ఫ్లిప్‌కార్ట్ మరో సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్(38 ఏళ్లు) రూ. 7,800 కోట్లతో ఎనిమిదో స్థానం, ఓలా అధినేత భవిష్ అగర్వాల్(36 ఏళ్లు) రూ. 7,500 కోట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇక, ఈ జాబితాలో అత్యంత చిన్న వయస్కుడిగా ఓయో సంస్థకు చెందిన రితేష్ అగ్ర్వాల్(27 ఏళ్లు) రూ. 6,300 కోట్లతో పదో స్థానంలో ఉన్నారు. రితేష్ ఆస్తులు ఈ ఏడాదిలో 40 శాతం పెరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed