- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్మ పాట… కరోనా వింటే చనిపోతుందట…
దిశ, వెబ్‌డెస్క్: ఆర్జీవీ ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. ఎప్పుడు? ఎలా? ఏ విధంగా? స్పందిస్తారో ఎవరికి అంతుపట్టదు. అంత వెరైటీగా స్పందిస్తారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ‘కరోనా క్రైసిస్ చారిటీ’ ద్వారా మెగాస్టార్ చిరు, కింగ్ నాగ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్‌లు కోటి మ్యూజిక్ డైరెక్షన్‌లో వీడియో సాంగ్ చేశారు. ఈ పాట ద్వారా స్ఫూర్తి పొందిన వర్మ.. నేను కూడా ఏప్రిల్ 1న ఓ సాంగ్ రిలీజ్ చేస్తానని… చేతులు కడుక్కుని, చెవులకు మాస్క్‌లు వేసుకుని పాట వినాలని సూచించాడు. చెప్పినట్లుగానే తనే రాసి, పాడిన సాంగ్ రిలీజ్ చేశాడు వర్మ.
” అది ఒక పురుగు … కనిపించని పురుగు.. కరోనా ఒక పురుగు… నలిపేద్దామంటే అంత సైజు లేదు గాని… పచ్చడి చేద్దామంటే కండ లేదు దానికి… అదే దాని బలం… అదే దాని దమ్ము… కంటికి కనిపిస్తే దానమ్మ దాన్ని కత్తితో పొడవచ్చు… ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పేల్చొచ్చు… బట్ ఇట్ ఈజ్ జస్ట్ ఏ పురుగు ” అంటూ సాగిన పాట రక్తచరిత్ర సాంగ్‌ను తలపిస్తున్నా… వినడానికి కాస్త ఇబ్బందిగానే ఉంది. కానీ వర్మకున్న ఫాలోయింగ్, కరోనా పట్ల జనానికి ఉన్న భయం.. సాంగ్‌ను యూట్యూబ్ ట్రెండింగ్స్‌లో నంబర్ 2 లో నడిపిస్తుంది. నిజానికి ఇలాంటి సాంగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటున్నారు ఆడియన్స్. వర్మ పాట వింటే కరోనా ఖచ్చితంగా చనిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.
Tags: RGV, CoronaVirus, Covid19, Ram Gopal Varma