- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాకు థాంక్స్ చెప్తున్న వర్మ…
దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ… మనుషుల్లో మరో రకం అంటారు. కొందరు మేధావి అని మెచ్చుకుంటే… మరి కొందరు ఏం మాట్లాడుతావ్ స్వామీ అంటూ విసిగించుకుంటారు. ఒక విషయం గురించి ప్రస్తావిస్తే ఆయన స్పందించే తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుందంటారు. పది మంది ఒక రకంగా ఆలోచిస్తే … వర్మ ఆలోచన మరోరకంగా ఉంటుందంటారు. ఇందులో వాస్తవమెంత ఉందో తెలియాలంటే… వర్మ పుట్టినరోజు వేడుకలు జరుపుకునే విధానాన్ని చూడాల్సిందే.
మంగళవారం బర్త్ డే జరుపుకుంటున్న వర్మ… కరోనాకు థాంక్స్ చెప్తున్నాడు. దేశంలో లాక్ డౌన్ కారణంగా ఒంటరిగా పుట్టినరోజు పండుగ జరుపుకునే చాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నాడు. తనకు తానే బర్త్ డే సాంగ్ పాడుకుంటున్న వర్మ … తనలో జోష్ నింపేందుకు కరోనాను తనకు విష్ చేయాలని కోరుతున్నాడు. ఈ సమయంలో మనుషులతో ఫోన్‌లో కూడా టచ్‌లో ఉండేందుకు ఇష్టపడడం లేదు ఆర్జీవీ. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు, ఫ్రెండ్స్ బర్త్ డే విష్ చేయాలని కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదట. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన పూరీ… గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్.. మీ పుట్టుక మాలాంటి ఎంతో మందికి మానసిక పునర్జన్మ ఇస్తు్ందంటున్నారు.
Thanks to Corona i am bringing in my tmrws birthday all alone in lockdown singing happy birthday song to myself 😢🙄😫please greet me to cheer me🙏 pic.twitter.com/znsfXVsZML
— Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2020
Tags: RGV, Ram Gopal Varma, BirthDay, Corona, CoronaVirus, Covid19