- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ కుటుంబం మాటంటే మాటే : షాద్ నగర్ ఎమ్మెల్యే
దిశ, నందిగామ: గాంధీ కుటుంబం మాటంటే మాటే అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం నందిగామ మండలం రంగాపుర్ గ్రామంలో సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై, సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ,ఆర్థిక, విద్య ,ఉపాధి, ఉద్యోగం, రాజకీయాలలో అన్ని వెనుకబడిన కులాలకు అసమానతలు లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందించి మార్పు తీసుకురావాలనే సదుద్దేశంతో సమగ్ర సర్వేను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమతి, వ్యవసాయ బ్యాంకు అధికారి సుధాకర్, తాసిల్దార్ రాజేశ్వర్,ఎంపీఓ సింగ్, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు జంగా నరసింహులు, కొమ్ము కృష్ణ, దేపల్లె కుమార్ గౌడ్, చంద్రపాల్ రెడ్డి, జ్ఞానేశ్వర్, తోట రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.