- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుత్తి'పాల్'.. నీకు అంత సీన్ ఉందా?: వర్మ
దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి కేఏ పాల్‌ను టార్గెట్ చేశాడు. ప్రపంచంలో అవినీతి, అన్యాయం పెరిగిపోతున్నందున కరోనా వైరస్ ద్వారా దేవుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడని… ఈ పరిస్థితి నుంచి రక్షించబడాలంటే దేవుడిని ప్రార్థించాలన్న కేఏ పాల్ సూచనలపై సెటైర్ వేశాడు ఆర్జీవీ. ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదా సుబ్బారావు(కేఏపాల్) అని విమర్శించాడు. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకి నాకు కరోనా వచ్చేట్లు చేయ్ ఎంకమ్మా అంటూ సవాల్ విసిరాడు. వర్మ ట్వీట్‌పై నెటిజన్లు మరింత వింతగా స్పందించారు. కేఏపాల్ దమ్ము ధైర్యం గురించి ఎందుకులే వర్మ… ఓ సారి చైనా వెళ్లిరా.. ఆ తర్వాత కరోనా రాకపోతే అడుగు అంటూ కామెంట్ చేస్తున్నారు.
కేఏ పాల్‌పై సెటైర్లు వేసిన రామ్ గోపాల్ వర్మ.. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్న కరోనాను వదులుతాడా? కరోనాపై కూడా తనదైన రీతిలో సెటైర్లు వేశాడు. దేవుడు, కరోనా వైరస్ రహస్యబంధం ఏర్పరుచుకున్నారని… ఆ ప్రేమకథలో మానవులు విలన్లు అని చెప్పుకొచ్చాడు. అందుకే ఇద్దరు కలిసి విలన్లను టార్గెట్ చేసి చంపేస్తున్నారన్నాడు. ఒకవేళ పాల్ చెప్పినట్లే దేవుడు పాపాత్ములను శిక్షించేందుకే కరోనా ద్వారా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడంటే… అలాంటి పాపాత్ములను మనమెందుకు కాపాడాలి? అంటే మనం దేవుడికి విరుద్ధంగా పనిచేస్తున్నామా? అని ప్రశ్నిస్తున్నాడు వర్మ. ఇంకో విషయం ఏ మతం మనల్ని రక్షించనప్పుడు… కరోనా మతాన్ని ఆలింగనం చేసుకోవడం ఉత్తమమని ఉచిత సలహా కూడా ఇచ్చాడు ఆర్జీవీ.
మరోవైపు కరోనాను బాహుబలితో పోలుస్తూ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాహుబలి సినిమా చూసేందుకు టికెట్ల కోసం నిల్చున్న క్యూ లైన్ రికార్డ్‌ను కరోనా వైరస్ బీట్ చేసేసిందని చెప్పాడు. అమెరికాలో కరోనా వైరస్ ప్రభావంతో భయపడుతున్న జనం ముందు జాగ్రత్తగా సరుకులు తెచ్చుకునేందుకు వేచి ఉన్న క్యూ లైన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిందంటూ కామెంట్ చేశాడు. కాగా వర్మ కరోనా ట్వీట్లు సోషల్ మీడయాలో వైరల్ అయ్యాయి.
Tags: KA Paul, RGV, RamGopal Varma, Varma