- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెండింగ్‌లో ‘ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్
దిశ, వెబ్‌డెస్క్: వివాదాల వర్మ.. రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రం ‘ఆర్జీవీ మిస్సింగ్’. ఆదివారం దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. తన సినిమాల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను టార్గెట్ చేసిన వర్మ.. ఈ సారి తన కిడ్నాప్ కేసుతో పవర్‌స్టార్, మెగాస్టార్ ఫ్యామిలీ, నారా చంద్రబాబు కుటుంబం, బాలకృష్ణ, కేఏ పాల్ లక్ష్యంగా ట్రైలర్ వదిలాడు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను కూడా వదిలేది లేదంటూ ఈ కిడ్నాప్ కేసులో ఇన్వాల్వ్ చేశాడు.
More than 1 million views in 1 day of RGV MISSING Trailer https://t.co/0zHVKUIBap
— Ram Gopal Varma (@RGVzoomin) October 26, 2020
ఇంతకీ కథేంటి అంటే.. ఒక రోజు ఆర్జీవీని నిద్రలేపేందుకు వెళ్లిన ఆఫీస్ బాయ్.. వర్మ కిడ్నాప్ అయ్యాడని తెలుసుకుంటాడు. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పవర్‌స్టార్, మెగాస్టార్, బాలకృష్ణ, కేఏ పాల్, బాబు ఇలా అందరినీ విచారించేందుకు ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రజినీకాంత్‌ను అపాయింట్ చేస్తుంది. కేసులో పెద్ద పెద్ద పొలిటీషియన్లు, సినిమా వాళ్లు ఇన్వాల్వ్ అయినా సరే, వదిలిపెట్టేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం.. దీంతో భయపడిన సెలబ్రిటీలు అజ్ఞాతంలోకి వెళ్లడం ట్రైలర్‌లో చూపించాడు. అరెస్టింగ్ సూన్ అంటూ ట్రైలర్ ఎండ్ కాగా.. ఇంతకీ ఆర్జీవీని కిడ్నాప్ చేసింది ఎవరు? అనే దానిపై చర్చ చాలా ఫన్నీగా జరుగుతుంది. ఇదంతా తన కల అంటాడేమో అని కొందరు అంటుంటే.. అసలు తనను ఇంట్లో సరిగ్గా వెతకకుండానే పోలీసులకు కంప్లైంట్ చేసారేమో అని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులను వెధవలను చేయడంలో మాత్రం ఆర్జీవీ మళ్లీ మళ్లీ సక్సెస్ అవుతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్‌లో కేవలం ఫస్ట్ అండ్ లాస్ట్‌లో కనిపించే ఆర్జీవీ.. మొత్తానికి సెలబ్రిటీ కుటుంబాలను పెంట పెంట చేయాలని ప్లాన్ వేశాడని అంటున్నారు.