- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డికి పీసీసీ: గుండు గీయించుకున్న కాంగ్రెస్ నాయకుడు
దిశ, పాలేరు: రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు అయితే తన తలనీలాలు ఇస్తానని మొక్కుకున్న ఓ అభిమాని ఆదివారం గుండు గీయించుకొని మహాబుబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్ర స్వామికి మొక్కు చెల్లించాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రానికి చెందిన బాసనబోయిన మధు అనే యూత్ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి వీరాభిమాని. గత మూడు నెలలుగా తెలంగాణ పీసీసీ కూర్పు కసరత్తు సాగుతోన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు కావాలని మహాబుబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్ర స్వామికి,సూర్యాపేట జిల్లా దూరజ్ పల్లి పెద్దగట్టు లింగన్న స్వామికి తన తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాడు.
ఎట్టకేలకు శనివారం రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తున్నట్లు ప్రకటన రావడంతో వెంటనే ఆదివారం కొరివి వీరన్న స్వామి గుడికి వెళ్లి గుండు గీయించుకొని తన మొక్కు తీర్చుకున్నాడు. ఇక సోమవారం దూరజ్ పల్లిలోని పెద్దగట్టుకు వెళ్లనున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. తన అభిమాని రేవంత్ రెడ్డికి అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఈ దర్శన కార్యక్రమంలో మండల యూత్ కార్యకర్తలు వెంకటేష్,గోళ్ళ మహేష్ తదితరులు ఉన్నారు.