- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నివారణపై హరీష్ రావు సమీక్ష
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలపై మంత్రి హరీశ్ రావు సోమవారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతను అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత చర్యలు చేపడుతున్నారన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. స్వీయ నిర్బంధం వల్లే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని మంత్రి వెల్లడించారు. పలువురు అధికారులు శాఖా పరంగా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హుస్నాబాద్ మున్సిపాలిటీకి అవసరమైన బ్లీచింగ్, ఫినాయిల్ సరఫరా చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్ రావును కోరారు.
అధికారులకు మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మంచి నీటి ట్యాంకు దగ్గర గుంపులుగా గుమి గూడి ఉన్న ప్రజలను అలా ఉండకూడదని వివరించారు. సామాజిక, భౌతిక దూరాన్ని పాటించాలని వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా సమస్య తీరే వరకు ఆ దూరం పాటించాలని చెప్పారు. కరోనా ఇప్పటి వరకు గ్రామాల్లో లేనంత మాత్రాన.. నిర్లక్ష్యంగా ఉండొద్దని కూడా ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి సూచనలు చేశారు. అనంతరం సిద్ధిపేట జిల్లాలో చేపడుతున్న కరోనా నివారణ చర్యలపై హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఏంపీటీసీ, జెడ్పిటీసీ, అధికారులతో హుస్నాబాద్ లోని ఏంపీడీఓ కార్యాలయంలో హరీష్ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
tag:Harish Rao, Review meeting, Coronation Prevention