అసైన్డ్ భూమిపై రెవెన్యూ అధికారి కన్ను..!

by  |
అసైన్డ్ భూమిపై రెవెన్యూ అధికారి కన్ను..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దశాబ్దం క్రితం పేదలకు కేటాయించిన సర్కారు భూమిపై ఓ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కన్నేశాడు. అదే శాఖలోని ఉద్యోగుల సహకారంతో సోదరి పేర బినామీ పట్టా పొందాడు. అక్కడితో ఊరుకోకుండా పక్కనే ఉన్న భూమిని ఆక్రమించుకుని దానిని సైతం అమ్మేందుకు యత్నించారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. గ్రామస్తులు ఫిర్యాదుతో అధికారులు పట్టా రద్దు చేశారు. అయితే సదరు వీఆర్ఏ​ అక్కడితో ఊరుకోకుండా భూ మాఫియాతో చేతులు కలిసి విక్రయాలకు రంగం సిద్ధం చేశారు. ఆ ఉద్యోగి ఎవరు.? అతడికి మద్దతునిస్తున్న ఉద్యోగుల సంఘం నాయకుడెవరు..? లిటిగేషన్ భూముల వ్యవహరంలో సెటిల్మెంట్లు చేసే భూ మాఫియా వ్యవహరం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో 44 వ నంబర్ జాతీయ రహదారిని అనుకుని పాత రాజంపేట్ శివారు క్యాసంపల్లి రోడ్డు వెంట 114 సర్వే నంబర్ లోని సర్కారు స్థ లాన్ని దాదాపు దశాబ్దం క్రితం నిరుపేదలకు అసై‌న్డ్​ చేశారు. జిల్లా కేంద్రం కావడంతో రియల్ భూమ్​కు రెక్కలు వచ్చాయి. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో సర్కారు భూమిపై జిల్లాలో పనిచేస్తున్న వీఆర్​ఏ కన్ను పడింది. చిరుద్యోగైనా తనకున్న పరిజ్ఞానం, ఓ తహసీల్దార్ సహకారంతో అదే సర్వే నెంబర్లోని ఐదెకరాలను కామారెడ్డిలో నివాసం ఉండే తన సోదరి పేరుపై పట్టా పాసు పుస్తకం పొందాడు. అలాగే దానిని అనుకుని ఉన్న భూమిని సైతం కలిపేసుకున్నట్టు సమాచారం. ఇదే భూమిని గతంలో హైదరాబాద్​కు చెందిన వ్యక్తికి ప్రై వేట్ పారా మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆ భూమి లావణి పట్టా అని తెలియడంతో డీల్​ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం.

రంగంలోకి భూ మాఫియా..

జాతీయ రహదారి పక్కనే ఉన్న ఐదెకరాల భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో​ సుమారు రూ. 15 కోట్ల విలువ ఉంటుంది. ఆ భూమిని సదరు వీఆర్​ఏ కేవలం రూ. రూ. 40 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న క్యాసంపల్లి గ్రామస్తులు, స్థానిక నాయకులు అడ్డుకున్నారు. విషయాన్ని గ్రామాని కి చెందిన ఓ వ్యక్తి సోషల్​ మీడియాలో పోస్టు చే శాడు. ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి గ్రామస్తులు సిద్ధపడ్డారు. గ్రామ అవసరా ల కోసం కేటాయించాలని కోరాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికా రులు విచారణ చేసి ఆగస్టులో పాస్​బుక్​ను రద్దు చేశారు. అయినా పట్టు వీడని వీఆర్​ఏ రంగం లోకి భూ మాఫియాను దింపాడు. వివాదాస్పద భూముల్లో తలదూర్చి కాజేసే ఈ మాఫియాకు సదరు వీఆర్​ఏ చేదోడు వాదోడుగా ఉంటూ ఈ భూమి విషయంలో వారి సహకారం తీసుకున్న ట్లు తెలుస్తోంది. పాస్​బుక్​ రద్దయిన తర్వాత భూ మిని చదును చేయించే పనులు మొదలు పెట్టడం గమనార్హం. తొలుత వీఆర్ఏను అడ్డుకున్న నాయ కులు, గ్రామస్తులు సైతం భూ మాఫియా రంగ ప్రవేశంతో సైలెంట్ అయ్యారు. అయితే ఇదే భూమి విషయంలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి శివారులోని ఓ పాఠశాలలో తిష్ట వేసి సదరు భూమి తనదేనటూ గగ్గోలు పెట్టడం, అతడికి గ్రా మ నాయకులు మద్దతివ్వడంతో అధికారులు అ ప్రమత్తమై వాస్తవాలను వెలికి తీస్తున్నారు.

పట్టా రద్దు చేసినా..

కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనడానికి ఇది నిదర్శనం. 114 సర్వే నంబర్‌లోని సర్కారు భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు పట్టాను రద్దు చేసినప్పటికీ తమకు పాత పట్టా ఉందని, రెవెన్యూ కోర్టుల్లో ఉందని భూ మాఫియా బరి తెగించి పనులు నిర్వహిస్తున్నది. యంత్రాలతో పనులు చేయిస్తున్న విషయం తెలుసుకున్న తహసీల్దార్​ అమీన్ సింగ్ భూమిని పరిశీలించి ట్రాక్టర్ ను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. ఆక్రమంగా అనుమతులు లేకుండా సర్కారు భూమిలో చదును చేయడంతోనే సీజ్ చేసినట్లు ఆయన పేర్కొంటున్నారు.


Next Story

Most Viewed