మీడియాపై ఎన్టీఆర్ ఫైర్.. ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చింది.. హోటల్ రూమ్‌లో ఏం చేశాడు..

by Sujitha Rachapalli |
మీడియాపై ఎన్టీఆర్ ఫైర్.. ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చింది.. హోటల్ రూమ్‌లో ఏం చేశాడు..
X

దిశ, సినిమా :యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ సెలబ్రిటీ అయిపోయాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’తో బిజీగా ఉన్న ఆయన.. బాలీవుడ్ ఫిల్మ్ ‘వార్ 2’ ప్రాజెక్ట్‌లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేయగా.. రీసెంట్‌గా సెకండ్ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యేందుకు ముంబై వెళ్లాడు. అక్కడే రెండు రోజులుగా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే తారక్ హోటల్ రూమ్‌లోకి వెళ్తున్న క్రమంలో బాలీవుడ్ మీడియా క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన ఆయన కాస్త చిరాకు పడ్డాడు. దీంతో అక్కడి నార్త్ మీడియా నెగెటివ్‌గా ప్రచారం చేస్తుంది. కానీ ఒక ఆర్టిస్టుగా ఆలోచించే.. ఓ ప్రాజెక్ట్‌కు అన్యాయం జరగకూడదనే ఇలా చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు.

విషయం ఏంటంటే.. ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఆ లుక్‌లోనే హోటల్‌కు వెళ్లాడు. ఆ గెటప్, మేక్ ఓవర్ డిఫరెంట్‌గా ఉండటం.. లుక్ బయటకు వస్తే ప్రాజెక్ట్ గురించి రివీల్ చేసినట్లు అవుతుందనే అలా ఫైర్ అయినట్లు తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా నార్త్ మీడియా చేస్తున్న పనికి అభిమానులు తిట్టిపోస్తున్నారు. మినిమమ్ వాల్యూస్ మెయింటైన్ చేయకుండా ఇలాంటి నెగెటివిటీ తీసుకురావడం సరికాదని అంటున్నారు. కాగా తారక్ ఈ సినిమాకు రూ. 80కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.

Advertisement

Next Story