సూరీడు ఎంట్రీపై స్పందించిన రేవంత్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-02-17 04:26:21.0  )
సూరీడు ఎంట్రీపై స్పందించిన రేవంత్ రెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి‌కి అత్యంతన సన్నిహితుడిగా పని చేసిన సూరీడు.. వైఎస్ మరణానంతరం తెర చాటుకు వెళ్లిపోయారు. వైఎస్ కుటుంబానికి, సన్నిహితులకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే చాలా ఏళ్ల తర్వాత రైతులకు మద్ధతుగా చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన రాజీవ్ రైతు రణభేరీ సభా వేదికపై తళుక్కున మెరిశారు. రేవంత్ సభలో సూరీడు ఎంట్రీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు మద్ధతుగా సూరీడు వచ్చారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్​ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఏపీ నుంచి సూరీడు మంచి పని కోసం వచ్చారని అన్నారు. రైతుల కోసం కొట్లాడుతున్నామని.. వారికి అండగా ఉంటామని వచ్చారని తెలిపారు. సూరీడు తనకు మంచి మిత్రుడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల కోసం చేస్తున్న పోరాటానికి ఎవరైనా మద్దతుగా ఉండవచ్చన్నారు. పార్టీలోని అన్ని వర్గాలు రైతుల కోసం కొట్లాడుతాయన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం సమిష్టిగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై చేసే ప్రతి పోరాటంలో కాంగ్రెస్​ జెండా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

షర్మిల పార్టీపై మరోసారి మంత్రి గంగుల అటాక్

Advertisement

Next Story