- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెన్సేషనల్ న్యూస్ : భట్టితో రేవంత్ భేటీ.. ఫలించిన రాయబారం
దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కోసం మల్లు రవి రాయబారం ఫలిస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను బుజ్జగించేందుకు మల్లు రవి రంగంలోకి దిగారు. మొన్నటి వరకు ఢిల్లీలో ఉండి, అధిష్టానం నేతలను కలిసి వచ్చిన భట్టి… ఇటీవల రేవంత్‌రెడ్డిని కలిసేందుకు సమయం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మాజీ ఎంపీ, భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి ఆయన ఇంటికి వెళ్లాడు. దాదాపు గంటపాటు చర్చించారు. దీంతో భట్టి విక్రమార్క… టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో మంగళవారం మధ్యాహ్నం సమావేశమైన రేవంత్… అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం భట్టి ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. బుధవారం జరిగే ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.
కాగా భట్టితో భేటీ తర్వాత మల్లు రవి మీడియాతో మాట్లాడారు. తమ్ముడితో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో పీసీసీ ఎంత ముఖ్యమో.. సీఎల్పీ నేత కూడా అంతే ముఖ్యమని, పీసీసీ, సీఎల్పీ రెండు కళ్లలాంటి వారన్నారు. భట్టి విక్రమార్క తన తమ్ముడని, సోనియా గాంధీ నిర్ణయం మేరకు పనిచేయాలని సూచించినట్టు తెలిపారు. గతంలో రేవంత్ కుటుంబం తాను ఎంపీగా గెలవడానికి పని చేసిందని, అందుకే తాను రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచానన్నారు. శ్రీధర్ బాబుకు పీసీసీ ఇవ్వాలని భట్టి కోరారని, అధిష్ఠానం రేవంత్‌వైపు నిలిచిందన్నారు. తన అనుచరులతో మాట్లాడతానని భట్టి తనతో అన్నారని రవి తెలిపారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని, కేసీఆర్‌ను గద్దె దించడానికి అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలు లేవని, టీ కప్పులో తుఫాను లాంటివే ఇవన్నీ అన్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి అందరూ అటెండ్ అవుతారన్నారు.