- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగ చేతికి తాళాలిచ్చిన రెస్టారెంట్ ఓనర్
దిశ, ఫీచర్స్: చిన్నప్పుడు ‘రాజు గారు ఏడు చేపల కథ’ గురించి వినే ఉంటారు. అందులో పాపను ఎందుకు కుట్టావు? అని చీమను అడిగితే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా! అని సమాధానమిస్తుంది. ఇదొక నీతి కథ కాగా, నిజ జీవితంలో ఎవరికైనా నష్టం కలిగిస్తే ఊరుకుంటారా? ప్రసక్తే లేదు. పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేస్తారు లేదంటే నష్టపరిహారం చెల్లించమని డిమాండ్ చేస్తారు. కానీ ఇక్కడొక వ్యక్తి మాత్రం తన రెస్టారెంట్‌కు కన్నం వేసిన వ్యక్తికి ఉద్యోగమిచ్చి అందరి మనసులు గెలుచుకున్నాడు.
జార్జియా దేశం, అగస్టాలోని వాషింగ్టన్ రోడ్‌లో ‘డయాబ్లోస్ సౌత్‌వెస్ట్ గ్రిల్’ పేరుతో ఓ రెస్టారెంట్ ఉంది. ఎప్పటిలాగే ఏప్రిల్ 3వ తేదీ ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులు.. అక్కడ ఫ్రంట్ డోర్ పగిలిపోయి ఉండటాన్ని గమనించారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఆరోజు ఉదయం 4 గంటల సమయంలో ఓ దొంగ అద్దం పగులగొట్టుకొని లోపలికి ప్రవేశించినట్టు అర్థమైంది. ఇదే విషయాన్ని రెస్టారెంట్ యజమాని కార్ల్ వాలక్‌కు తెలియజేశారు. సాధారణంగా ఏ ఓనర్ అయినా ఇలాంటి న్యూస్ వింటే అప్‌సెట్ అవుతారు. కానీ కార్ల్ మాత్రం ఆ దొంగ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించాడు. అంతేకాదు అతనికి సాయపడేందుకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
‘జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక జీవనోపాధి కోసం పోరాడుతూ, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న దొంగకు.. దయచేసి ఈ జాబ్ అప్లికేషన్‌ను వెంటనే ఫిల్ చేయండి’ అని కార్ల్ తన రెస్టారెంట్ ఫేస్‌బుక్ వాల్‌పై పోస్ట్ చేసి, నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ పోస్టుకు విపరీతమైన స్పందన రాగా, దాదాపు 5 వేల మంది షేర్ చేయడం విశేషం.
‘ఈ సంఘటన గురించి తెలియగానే అందరిలా నాకు కూడా మొదట కోపం వచ్చింది. కానీ ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచిస్తే గ్లాస్ డోర్‌ను పగలగొట్టడం అంటే చాలా ప్రమాదకరమైన పని. లైఫ్ రిస్క్ చేసి మరీ ఇలాంటి దొంగతనానికి పాల్పడుతున్నాడంటే.. అతని పరిస్థితి ఎలాంటిదో? రియలైజ్ అయ్యాను. అందుకే కొత్తగా ఏదైనా చేయాలనుకున్నా. ఒకవేళ ఆ దొంగను పోలీసులకు పట్టిస్తే జైలు శిక్ష, క్రిమినల్ రికార్డ్ కారణంగా మళ్లీ తనకు ఉద్యోగం లభించాలంటే కష్టం. అందుకే నేనే ఉద్యోగమివ్వాలని డిసైడ్ అయ్యాను’ అని కార్ల్ చెప్పుకొచ్చాడు.