‘పీవీ’కి గౌరవం దక్కలేదనేది వాస్తవం : కేసీఆర్

by Anukaran |   ( Updated:2020-09-08 00:26:16.0  )
‘పీవీ’కి గౌరవం దక్కలేదనేది వాస్తవం : కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. మొదటగా పీవీ శత జయంతి ఉత్సవాలపై సీఎం కేసీఆర్ స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావుకు ‘భారతరత్న’ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం మాట్లాడుతూ.. పీవీకి జాతీయ స్థాయిలో దక్కాల్సిన గౌరవం దక్కలేదనేది వాస్తవమన్నారు.

దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి దక్షిణ భారతీయుడు పీవీ అని ఆయన సేవలను కొనియాడారు. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా ఎదగడానికి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed