- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
#ResignJagan: రాష్ట్రాన్ని పాడే మీదికి తెచ్చావ్.. ఇక చాలు
దిశ, వెబ్ డెస్క్: దేశంలో ప్రస్తుతం నెలకున్న సంక్షోభానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో #Resignmodi హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. #Resignmodi హ్యాష్‌ట్యాగ్‌తో పెట్టిన పోస్టులను కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ట్విట్టర్ బ్లాక్ చేయడం సంచలనంగా మారిన విషయం కూడా విదితమే. ఇక తాజాగా ఇదే ఇబ్బందిని ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కొంటున్నారు. తిరుపతిలోని ఎస్వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందర్నీ కలచివేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయాలో మరణమృదంగం మోగిందని, జగన్ ఇవేమి పట్టించుకోకుండా మోదీ కి మద్దత్తు ఇస్తూ కాలం గడుపుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుయా హాస్పిటల్లో జరిగిన దానికి సీఎం బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ #ResignJagan హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో టాప్ 2 లో కొనసాగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు 20.5 వేల ట్వీట్లు వేయడం గమనార్హం.