ఫైనాన్స్ కంపెనీలకు ఆర్‌బీఐ తాజా ఆదేశాలు!

by Harish |
Reserve Bank of India
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్విడిటీ కవరేజ్ రేషియో, రిస్క్ మేనేజ్‌మెంట్, లోన్-టూ-వాల్యూ సహ ఇతర నిబంధనలకు సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్‌సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజాగా ఆదేశాలను విడుదల చేసింది. ఈ ఆదేశాలకు తక్షణమే అమలవుతాయని, డిపాజిటర్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా హెచ్ఎఫ్‌సీల వ్యవహరించేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఆర్‌బీఐ వివరించింది. రూ. 10 వేల కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్న అన్ని నాన్-డిపాజిట్ హెచ్ఎఫ్‌సీలు, మిగిలిన అన్ని హెచ్ఎఫ్‌సీలు ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి 50 శాతం లిక్విడ్ కవరేజ్ రేషియోను నిర్వహించాలని ఆర్‌బీఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. డిపాజిట్లను తీసుకునే, తీసుకోని, రూ. 100 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులున్న హెచ్ఎఫ్‌సీలు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి లోపాలు లేకుండా తగిన చర్యలను తీసుకోవాలని ఆర్‌బీఐ వెల్లడించింది. వ్యక్తులకు రూ. 30 లక్షల వరకు లోన్-టూ-వాల్యూ(ఎల్‌టీవీ) నిష్పత్తి 90 శాతం మించి ఇవ్వకూడదు. అలాగే, రూ. 75 లక్షల వరకు ఎల్‌టీవీ 80 శాతానికి మించి ఇవ్వకూడదు. అదేవిధంగా ఎల్‌టివి నిష్పత్తి 75 శాతంతో రూ .75 లక్షలకు పైన వ్యక్తులకు ఈ సంస్థలు గృహ రుణాలు ఇవ్వకూడదు.

Advertisement

Next Story

Most Viewed