- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ కథనంతో కదలిక.. టీఆర్‌ఎస్ నేత భూ బాగోతంపై కలెక్టర్‌కు నివేదిక
దిశ, వాజేడు: టీఆర్ఎస్ నేత భూ బాగోతం అని వచ్చిన కథనంపై స్పందించిన ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పూర్తి నివేదిక సమర్పించాలని వాజేడు ఎమ్మార్వో రాజ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. భూ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి ఆ భూమి అతనికి ఏ విధంగా సంక్రమించింది అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పేరూరు జి 42 /1/1 సర్వే నెంబర్ ay గల భూమిని పోరంబోకు భూమిగా గుర్తించారు. 2015వ సంవత్సరంలో పాత పట్టాలు సృష్టించి 2018 సంవత్సరంలో భూ ప్రక్షాళన జరుగుతున్న సమయంలో నూతన పట్టా పొందినట్లు అధికారుల నివేదికల ద్వారా వెల్లడైనట్లు ఎమ్మార్వో రాజ్ కుమార్ తెలిపారు.
ఆ రెండు ఎకరాల భూమిలో గొడుగులురి మోహన్ రావు ఇల్లుతో పాటు ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదల ఇల్లు కూడా ఉన్నట్లు గుర్తించి జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపినట్లు ఎమ్మార్వో తెలిపారు. భూ బాగోతంపై దిశ పత్రికలో వెలువడిన కథనానికి చక్కటి స్పందన లభించింది. మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో దిశ కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ కథనంపై పలు పార్టీల నాయకులు స్పందించి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా అక్రమంగా దొడ్డిదారిన పట్టాలు చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- land scam