ఆ ఉద్యోగాలు భర్తీ చేయండి : సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ

by srinivas |
ఆ ఉద్యోగాలు భర్తీ చేయండి : సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ మూడు రోజులుగా లేఖల దాడికి దిగుతున్న రఘురామ.. తాజాగా నాలుగోరోజు కూడా సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రతీ ఏడాది జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. గ్రామ సచివాలయాల్లో ప్రస్తుతం 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. పశు సంవర్థక శాఖలో 6,100 ఉద్యోగాలు, విద్యాశాఖలో 18,000 ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ శాఖలో 6వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ ఉద్యోగాల భర్తీకి త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీని ప్రకటిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత సీఎం జగన్ హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు మెగా డీఎస్సీని నిర్వహించలేకపోయారని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story