- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైంటిస్ట్ కావాలనుకున్నా.. ఆర్టిస్ట్ అయ్యా : రేణు దేశాయ్
దిశ, వెబ్‌డెస్క్:
రేణు దేశాయ్ హీరోయిన్‌గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలని సూచించే రేణు.. ఎవరైనా తాము చేసే పనిలోనే ఆనందం వెతుక్కోవాలని సూచిస్తోంది. ‘ఒక్కోసారి మనం కన్న కలలు సాకారం కాకపోయినా సరే.. మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలే మనల్ని చరిత్రలో నిలబెడతాయి’ అని తెలిపింది.
సెప్టెంబర్ 9, 1995లో తను ఫస్ట్ టైమ్ కెమెరా ఫేస్ చేయగా.. బుధవారంతో 25 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపింది. చిన్నప్పటి నుంచి స్పేస్ సైంటిస్ట్ లేదా న్యూరో సర్జన్ అవ్వాలనుకున్నానని.. ఇందుకు మార్క్స్ షీట్స్ కూడా సపోర్ట్ చేశాయంది. కానీ 16 ఏళ్ల వయసులో తొలిసారి కెమెరాను ఎదుర్కొన్న సమయంలో.. విధి నా ప్రణాళికలను మార్చిందని అర్థమైందని తెలిపింది. కానీ ఆ తర్వాత ఫిల్మ్ మేకింగ్‌తో లవ్‌లో పడిపోయానని చెప్పింది.
అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని, నాసాలో చేరాలని కలలు కన్న తను.. 16 ఏళ్ల వయసులో ఆ కలను వీడి రావడం బాధాకరమైన నిర్ణయమని.. కొద్ది రోజులు చాలా బాధపడ్డానని చెప్పింది. కానీ సినిమా పట్ల ప్రేమ పెరిగే కొద్దీ ఆ బాధ మరిచిపోయినట్టు వెల్లడించింది. మనసు చెప్పింది అనుసరిస్తూ కష్టపడి పనిచేస్తే విజయం, ఆనందం మీ సొంతమని అభిమానులకు సలహా ఇచ్చింది రేణు. ఈ సందర్భంగా తన మొట్టమొదటి ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది.
https://www.instagram.com/p/CE6N14-hL95/?igshid=eda0k0rrrnd