15000 మంది ఉద్యోగులను తొలగించిన ‘రెనో’

by Shamantha N |

ముంబయి: కరోనా సంక్షోభం కారణంగా ఖర్చుల తగ్గింపులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనో తెలిపింది. వచ్చే మూడేండ్లలో రూ.16,000కోట్ల ఖర్చుల తగ్గింపులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 15000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థకు మూల కేంద్రమైన ఫ్రాన్స్‌లో 4600మంది, ఆయా దేశాల్లో 10,400 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిపింది. రెనోకు ప్రపంచవ్యాప్తంగా 1.80లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

Advertisement

Next Story