రైతులతో చర్చలు పునరుద్దరించండి: హర్యానా డిప్యూటీ సీఎం

by Shamantha N |
రైతులతో చర్చలు పునరుద్దరించండి: హర్యానా డిప్యూటీ సీఎం
X

చండీగఢ్ : కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సుమారు నాలుగు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో పోరాడుతున్న రైతులతో చర్చలను పునరుద్దరించాలని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రధాని మోడీని కోరారు. రైతుల ఉద్యమం ప్రారంభమై వంద రోజులు పూర్తైన నేపథ్యంలో ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో మన అన్నదాతలు రోడ్ల మీద ఉన్నారు. వంద రోజులుగా వాళ్లు పోరాటం చేస్తున్నారు. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 26 గణతంత్ర దినోత్సవం ముందు వరకు రైతులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. ఆ తదనంతర పరిణామాలతో వాటిని పక్కనబెట్టింది. దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ తీవ్ర స్థాయికి పెరుగుతున్న వేళ రైతులతో చర్చలు జరపాలని హర్యానాలో నిరసనకారులు ఆందోళన బాటపట్టారు.

Advertisement

Next Story

Most Viewed