- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలయన్స్ డిజిటల్ ఆదాయం 40 శాతం వృద్ధి
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద రిటైల్ గొలుసు అయిన రిలయన్స్ డిజిటల్ ఆదాయ పరంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగష్టు, సెప్టెంబర్‌లలో 30-40 శాతం వ్యాపారం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. నెలవారీ ప్రాతిపదికన స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేట్లలో డిమాండ్ అధికంగా ఉందని కంపెనీ తెలిపింది.
నిజానికి, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ల్యాప్‌టాప్‌లకు అత్యధిక డిమాండ్ ఉంటుందని అంచనా వేశామని, అయితే అవి గతేడాది విక్రయాల్లో 50-60 శాతం మాత్రమే విక్రయించగలుగుతున్నట్టు రిలయన్స్ డిజిటల్ సీఈవో బ్రయాన్ బేడ్ చెప్పారు. ‘ప్రజలు ఎక్కువగా టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, చిన్న చిన్న గృహోపకరణాలను కొనుగోలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత వ్యక్తిగత పనులు పెరగడం, సొంతంగా వంట చేసుకోవడం పెరగడంతో గ్రైండర్లు వంటి ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉందని బ్రయాన్ తెలిపారు.
రిలయన్స్ డిజిటల్ సంస్థ దేశీయంగా మొత్తం డ్యూరబుల్స్, స్మార్ట్‌ఫోన్స్ రిటైల్ మార్కెట్లో 17 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ. 44,625 కోట్ల అమ్మకాలను నిర్వహించింది. కరోనా మహమ్మారి కారణంగా వినియోగ అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడంతో స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, గృహోపకరణాల అమ్మకాల్లో నెలవరీ పెరుగుదల ఉన్నట్టు రిటైలర్లు తెలిపారు.