ప్రకాశం బ్యారేజి నుంచి నీటి విడుదల

by  |
ప్రకాశం బ్యారేజి నుంచి నీటి విడుదల
X

దిశ, ఏపీబ్యూరో: గత రెండ్రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద నీరు పొటెత్తడంతో అధికారులు బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన వున్న కీసర (మున్నేరు, మధిర, కట్టలేరు), వెలగలేరు (బుడమేరు, పోతుల వాగు), వజినేపల్లి, పాలేరు వాగుల నుంచి రోజూ 22వేల 525 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వస్తోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రకాశం బ్యారేజీ 22 గేట్లను అడుగు మేర ఎత్తి 18వేల125 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే తూర్పు, పశ్చిమ కాల్వలకు 4వేల 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో వరద ఉధృతి పెరిగే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Next Story

Most Viewed