కేఎంసీకి రూ.12 కోట్ల నిధుల విడుదల

by Shyam |
కేఎంసీకి రూ.12 కోట్ల నిధుల విడుదల
X

దిశ ప్రతినిధి, వరంగల్: వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లోని పీఎంఎస్ఎస్ వై వైద్య‌శాల‌కు రూ.12 కోట్లను విడుద‌ల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎంఎస్ఎస్ వై హాస్పిట‌ల్ అభివృద్ధికి రూ.10 కోట్లు అడిగ్గా సీఎం కేసీఆర్ రూ.12 కోట్లు విడుద‌ల చేశారు. క‌రోనా నియంత్ర‌ణ కోసం 250 ప‌డ‌క‌ల వైద్య‌శాల‌గా సీఎంఎస్ ఎస్ వై హాస్పిట‌ల్‌ను వినియోగించాలని ప్ర‌భుత్వం నిర్ణయించింది. వెంట‌నే పరిపాల‌నా అనుమ‌తులు ఇవ్వాల‌ని రాష్ట్ర ఆర్థిక కార్య‌ద‌ర్శి రోనాల్డ్ రోస్ వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. రూ.10 కోట్లు అడిగితే, రూ.12 కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు, వైద్య‌శాఖ మంత్రి ఈట‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Advertisement

Next Story