'రెడ్'లో రామ్ 'ఇస్మార్ట్' రఫ్

by  |   ( Updated:2023-10-12 06:15:17.0  )
రెడ్లో రామ్ ఇస్మార్ట్ రఫ్
X

హీరో రామ్ పోతినేని 18వ చిత్రం రెడ్. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో అదే సక్సెస్ ఫ్రీక్వెన్సీ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. అందుకే తమిళ సూపర్ హిట్ మూవీ ‘తడమ్‌’ను రీమేక్ చేస్తూ తెలుగులో ‘రెడ్’గా వచ్చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నివేదిత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత హీరోయిన్లుగా నటిస్తున్న రెడ్‌కు తిరుమల కిశోర్ దర్శకత్వం వహించగా స్రవంతి రవికిశోర్ నిర్మాత. గురువారం విడుదలైన రెడ్ టీజర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది. సిద్ధార్థ్, ఆదిత్యగా రెండు పాత్రల్లో కనిపించనున్న రామ్ టీజర్‌లో చాలా వేరియేషన్ చూపించాడు. సిద్ధార్థ్‌గా మోడ్రన్‌గా ఉన్న రామ్, ఆదిత్యగా రఫ్‌ లుక్‌తో అదరగొట్టాడు. హీరో, విలన్ రెండు పాత్రల్లోనూ శభాష్ అనిపించాడు. ఓ మర్డర్ కేసులో నిందితుణ్ని కనుగొంటారు పోలీసులు. అయితే, అతన్ని పట్టుకునే క్రమంలో అదే పోలికలతో ఉన్న మరో వ్యక్తి కనిపిస్తాడు. ఇంతకి వీరిద్దరిలో అసలు నిందితుడు ఎవరు? పోలీసులు ఎలా కనుగొన్నారు? అసలు ఆ వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది సినిమా కథ. కాగా నివేదిత పేతురాజ్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది. మణిశర్మ మ్యూజిక్ మూవీకి ప్లస్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed