- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
319 టీబీపీఎస్ డేటా స్పీడ్‌తో జపాన్ రికార్డ్!
దిశ, ఫీచర్స్: ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా ఇమేజ్ లేదా సైట్ లోడ్ కాకపోతే.. వెంటనే డేటా స్పీడ్ చూస్తాం. కేబీపీఎస్ నుంచి టీబీపీఎస్ వరకు ఎంతగా ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే అంత వేగంగా డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. సాధారణంగా 100 Mbps లేదా అంతకంటే ఎక్కువ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను ‘వేగవంతమైన ఇంటర్నెట్’ స్పీడ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే ఆ స్పీడుతో అంతరాయాలు లేకుండా ఒకేసారి ఎక్కువమంది వినియోగదారుల మల్టీపుల్ ఆన్‌లైన్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. అయితే టెక్ నిపుణులు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ పెంచే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. 2020లో జపాన్, బ్రిటీష్ పరిశోధకుల బృందం 179 టీబీపీఎస్ వేగాన్ని సృష్టిస్తేనే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు దానికి రెట్టింపుగా 319 టెరాబైట్ల ఇంటర్నెట్ స్పీడ్‌తో జపాన్ అద్భుతాన్ని ఆవిష్కరించింది.
మనం ఇప్పటికీ ఇంటర్నెట్ నిరంతర ప్రసారాలు అందుకోవడంలో కష్టపడుతుండగా, జపాన్ పరిశోధకులు సెకనుకు 319 టెరాబైట్ వేగంతో డేటాను విజయవంతంగా బదిలీ చేశారు. జపాన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎన్ఐసీటీ) గత 179 టీబీపీఎస్ వేగాన్ని బద్దలు కొడుతూ, 319 టెరాబైట్ల ఇంటర్నెట్ వేగాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందుకోసం ప్రత్యేకమైన 0.125 మి.మీ ప్రామాణిక వ్యాసంలో ఫోర్-కోర్ ఆప్టికల్ ఫైబర్‌ను వినియోగించారు. వాటి ద్వారా సుదూరం నుంచి మొదటి ఎస్, సీ, ఎల్-బ్యాండ్ల ద్వారా డేటాను సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. సిగ్నల్ నాణ్యత లేదా వేగాన్ని కోల్పోకుండా 1,864-మైళ్ల దూరంలో డేటా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు కాయిల్డ్ ఫైబర్‌ను ఉపయోగించారు. అలాగే ‘వేవ్‌లెంత్-డివిజన్ మల్టీప్లెక్సింగ్’ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగా, ఇది సిగ్నల్లను 552 ఛానెల్లుగా విభజించి, ఫోర్-కోర్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా డేటా ప్రసారం చేసింది. ఫైబర్ వెంట 70 కిలోమీటర్ల (43.5 మైళ్ళు) వ్యవధిలో, ట్రాన్స్‌మిషన్ లాస్ నష్టాన్ని ఎర్త్ యాంప్లిఫైయర్స్ ఉపయోగించారు. ఇవి సిగ్నల్ బలాన్ని పెంచుతాయి. ఈ యాంప్లిఫైయర్లు అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ తులియం, ఎర్బియంతో తయారుచేశారు. 3వేల కిలోమీటర్లకు పైగా పనితీరు తగ్గకుండా ఒకే విధమైన బ్యాండ్‌విడ్త్‌తో డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతుందని పరిశోధకులు తెలిపారు.
భారతదేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 50 Mbps కాగా, నాసా 400 Gbps వేగంతో నడుస్తుంది. ఇక 1,000 Mbps.. 1 Gbps కు సమానం అయితే, 1 Tbps.. 1,000 Gbps కి సమానం. 319 టీబీఎస్ స్పీడుతో ఒక్క సెకన్‌లో వేలాది సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట.