గవర్నర్‌ను వెనక్కి తీసుకోండి -శివసేన

by Shamantha N |
గవర్నర్‌ను వెనక్కి తీసుకోండి -శివసేన
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్‌భవన్ ప్రతిష్ట కాపాడేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని వెనక్కి తీసుకోవాలని శివసేన కేంద్రానికి డిమాండ్ చేసింది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు వెంటనే మహారాష్ట్ర గవర్నర్‌ను రీకాల్ చేయాలని పార్టీ మౌత్‌పీస్ సామ్నాలో శివసేన పేర్కొంది.

గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని శివసేనపై దాడిచేసే బీజేపీ కుట్రను ఈ ఘటన బహిర్గతం చేసిందని ఆరోపించింది. ఒకవేళ ఆలయాలు తెరవాలని భావిస్తే కేంద్రమే ఒక విధానాన్ని రూపొందించాలని, దేశవ్యాప్తంగానూ ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇంకా మూసే ఉన్నాయని పేర్కొంది. అన్‌లాక్‌లో భాగంగా రాష్ట్రంలో ఆలయాలను తెరవకపోవడంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ప్రశ్నిస్తూ గవర్నర్ కొశ్యారీ రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే.

సీఎం ఠాక్రే ఒక్కసారిగా సెక్యూలర్‌గా మారిపోయారా? అంటూ ప్రశ్నించారు. దీనికి ఘాటుగా సమాధానమిస్తూ లౌకిక విలువలే ఆధారంగా గల రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ లౌకికత్వాన్ని చిన్నచూపు చూడటంపై అభ్యంతరం తెలిపారు. తాజాగా, గవర్నర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సామ్నాలో పార్టీ డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed