- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సభకు తీవ్ర వ్యతిరేకత… బయటపడ్డ అసలు విషయం ఇదే!!
దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభ.. ఆది నుంచే వివాదాల పాలవుతోంది. ఇన్ని రోజులు సభ కోసం వరంగల్ పరిసర ప్రాంతాల్లో స్థల సేకరణకు కసరత్తు చేసి చివరకు హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద 1100(ఇందులో 300 ఎకరాలను సభా ప్రాంగణం కోసం, 800 ఎకరాల్లో పార్కింగ్, తదితర అవసరాల కోసం) ఎకరాలను నిర్ణయించారు. కానీ, స్థలాన్ని ఇచ్చేందుకు దేవన్నపేట రైతులు వ్యతిరేకిస్తున్నారు.
పంట పొలాలను ఒక్క రోజు సభ కోసం పాడుచేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఎవ్వరు చెప్పినా తమ నిర్ణయాన్ని మార్చుకోబోమని, భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భూముల విషయమై రైతులను సంప్రదించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అయితే, భూముల కోసం కొందరు నాయకులు బెదిరిస్తున్నారని, రెండు రోజుల క్రితం కూడా అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటే వారు తమపై దాడి చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సభా స్థలాన్ని సర్వే చేసేందుకు అధికారులు వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న రైతులు పంట భూముల వద్దే మకాం వేశారు. అయితే, రైతులు.. అధికారులను రానివ్వడం లేదని డ్రోన్ల సాయంతో వారు సభాస్థలిని సర్వే చేసినట్లు సమాచారం.
ప్రకాశ్‌రెడ్డిపేట రైతుల పరిస్థితి మాకొద్దు : రైతులు
వరంగల్‌లోని ప్రకాశ్ రెడ్డిపేటలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2017 ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభా ప్రాంగణం కోసం భారీగా పంట పొలాలు, ఇంటి స్థలాలను సేకరించారు. ఈ భూములను చదును చేయడంతో రైతులు పంట పొలాల హద్దులను కోల్పోయారు. దీని ప్రభావం ఇప్పటికీ ఉండిపోయింది. ఇప్పటికీ హద్దుల వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీంతో ప్రకాశ్‌రెడ్డిపేట రైతులకు వచ్చిన పరిస్థితి మాకు రావద్దనే ఉద్దేశ్యంతోనే భూములు ఇచ్చేందుకు వెనకాడుతున్నామని అన్నారు. దాదాపు 1100 ఎకరాలను చదును చేసి సభ చేసుకొని వెళ్లిపోతారు. కానీ ఏళ్లు గడిచినా హద్దుల సమస్యలు వెంటాడుతాయి. విజయగర్జన సభకు భూములు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడానికి అసలు కారణం ఇదే అంటున్నారు. అంతేకాకుండా పండించే పొలాలను పార్టీ సభ కోసం పాడుచేయడం సరికాదని రైతులు వాపోతున్నారు.
టీఆర్ఎస్ కు సవాల్ విసిరిన ఈటల
TRS ట్రబుల్ షూటర్ స్ట్రగుల్ షూటర్ అయ్యారా? రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారిన హరీష్ రావు చరిష్మా! వరుసగా మంత్రి వ్యూహాలు ప్లాప్ వెనుక ఆ నేతల హస్తం??